Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహకారం అందించి అభివృద్ధిలో భాగం అవుతా

సహకారం అందించి అభివృద్ధిలో భాగం అవుతా

- Advertisement -

– రాష్ట్ర సహకార  యూనియన్ లిమిటెడ్  చైర్మన్  మనలా మోహన్ రెడ్డి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 

ఉప్లూర్ గ్రామ అభివృద్ధి కావాల్సిన నిధుల మంజూరు విషయంలో నావంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందించి అభివృద్ధిలో భాగం అవుతామని  రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్  చైర్మన్  మనలా మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం ఘనంగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సహకార  యూనియన్ లిమిటెడ్  చైర్మన్  మనలా మోహన్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉపసర్పంచ్ తక్కురి శేఖర్, నూతన పంచాయితీ పాలక వర్గనికి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా శైలేందర్ ను  ఎన్నుకున్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.

అన్నివేళలా గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు.. గెలుపు ఓటములు సహజం అన్నారు.ఒడిపోయాం అని బాధపడవాల్సిన అవసరం లేదని, గెలిచామని గర్వము ఉండాల్సిన అవసరం లేదన్నారు. నూతన సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా భారత రాజ్యాంగ బద్దంగా  గ్రామ ప్రజలందరినీ కలుపుకుని గ్రామాభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యాక్రమంలో  ప్రత్యేక అధికారి శరత్ కుమార్,వార్డ్ సభ్యులు గ్రామ ప్రముఖులు డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరసం చిన్నారెడ్డి, బిసి రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్, నల్ల మోహన్ రెడ్డి, సామ గంగారెడ్డి, బద్దం రాజేశ్వర్, సాదుల్లా, నందగిరి దాయనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -