మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి
నవతెలంగాణ – సదాశివ నగర్
పి ఆర్ ఏ వంటి కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధికి దోహదపడతాయని మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు. సదాశివనగర్ మండల కేంద్రంలో గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నియమించబడిన విద్యార్థులు సదాశివనగర్ గ్రామంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామాభివృద్ధి, వ్యవసాయ వనరులు, పంటల మౌలిక సమాచారం, సామాజిక నిర్మాణం, సమస్యలు, స్థానిక పరిష్కారాలు వంటి అంశాలపై గ్రామస్తుల భాగస్వామ్యంతో సమగ్ర సమాచారం సేకరించారు.కార్యక్రమంలో విద్యార్థులకు ఏఇఓ కవిత కీలకమైన సమాచారాన్ని అందించారు. గ్రామంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఆమె విలువైన సూచనలు అందించారు.
కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి హాజరై పీఆర్ఏ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్థుల సహాకారంతో కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు జైపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమేష్, మోహన్ రెడ్డి, రాజ్ రెడ్డి, లింగా రెడ్డి, రాజు విద్యార్థులకు తమ అనుభవాలు, గ్రామ పరిస్థితులపై తెలిపారు.