హైదరాబాద్‌లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్
సీఎం రేవంత్‌రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన ప్రధాన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సౌత్‌వెస్ట్ ప్రతినిధి బృందం ప్రకటించడం పట్ల సీఎం ఎ. రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సౌత్‌వెస్ట్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్, లీగల్ కౌన్సెల్ హెడ్ జాసన్ షయింగ్, హెచ్‌ఈఎక్స్ అడ్వైజరీ గ్రూప్ నుంచి సార్థక్ బ్రహ్మ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
తమ వ్యాపార వ్యూహ పరిణామానికి మద్దతుగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించాలని ఎంచుకున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సీనియర్ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. హైదరాబాద్ వద్ధి కథను వివరిస్తూ, రాష్ట్ర ”తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌లో భాగంగా, 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక దార్శనికతను ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్‌తోపాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.