నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారులదే ముఖ్య పాత్ర అని, గ్రామ అభివృద్ధికి అధికారులు సహకరించాలని వెలుగోముల సర్పంచ్ సువర్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రాల్లో తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ స్వప్నను గ్రామస్తులతో కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
పేద ప్రజలకు అధికారులు సేవ చేస్తే ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని, ప్రజా ప్రతినిధులు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటారని అధికారులు మాత్రం రిటైర్డ్ అయ్యేవరకు ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజలకు పనిచేసే విధంగా అధికారులు ఉండాలని కోరారు. మండలంలో ఉన్న ప్రజల సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తాసిల్దార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజేందర్ రెడ్డి, కృష్ణయ్య, భాస్కర్ చారి, వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



