Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడలతో మానసిక వికాసానికి దోహదం 

క్రీడలతో మానసిక వికాసానికి దోహదం 

- Advertisement -

• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
• ఉల్లాసంగా ఉపాధ్యాయుల క్రికెట్ మ్యాచ్ 
• పెద్దవంగర టైగర్స్ పై చిట్యాల లయన్స్ గెలుపు 
నవతెలంగాణ -పెద్దవంగర
ఉపాధ్యాయ, ఉద్యోగుల మధ్య క్రీడలు మానసిక వికాసానికి, సమన్వయానికి దోహదం చేస్తాయని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని రెండు కాంప్లెక్స్ ఉపాధ్యాయుల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ కు ఎంఈవో ముఖ్య అతిథిగా హాజరై, టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. క్రీడలు జట్టు స్పూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ భావన ఉద్యోగుల పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. 

• ఉత్సాహంగా ఉపాధ్యాయుల క్రికెట్ మ్యాచ్ 
మండలంలోని రెండు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పెద్దవంగర టైగర్స్, చిట్యాల లయన్స్ మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. పెద్దవంగర టైగర్స్ జుట్టుకు ఎండీ యాకుబ్ పాషా, చిట్యాల లయన్స్ జుట్టుకు చిక్కాల సతీష్ నాయకత్వం వహించారు. టాస్ గెలిచిన పెద్దవంగర టైగెర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణిత 12 ఓవర్లకు చిట్యాల జట్టు 143/5 రన్స్ చేసింది. జట్టులో వేముల సంతోష్ 44 రన్స్ (3*6, 5*4), జంగిలి రాజు 31, జాటోత్ రమేష్ 23, మురళి 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పెద్దవంగర జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి 59/3 పరుగులే చేసింది. చిట్యాల జట్టు 7 వికెట్ల తేడాతో పెద్దవంగర జట్టు పై విజయం సాధించింది. 

వేముల సంతోష్ 2 వికెట్లు, మురళి 1 వికెట్ తీశారు. అనంతరం విన్నర్, రన్నర్ జట్లకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, కవిరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ, చిరంజీవి, మధుసూదన్ రెడ్డి, వెంకన్న, మురళీ, నిఖిల్, నవీన్, లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -