Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంతోనే టీబీ నియంత్రణ: డా. శివకాంత్ 

పౌష్టికాహారంతోనే టీబీ నియంత్రణ: డా. శివకాంత్ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
టీబీ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారంతోనే నియంత్రణ సాధ్యమవుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శివకాంత్ చెప్పారు. గురువారం మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ, టీబీ వ్యాధిగ్రస్తులకు నిశ్చయ ఫుడ్ ప్యాకెట్లును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలని సీజన్లో వచ్చే వ్యాధులపై  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షయ వ్యాధి సోకినవారు వైద్య సిబ్బంది సూచనలు తప్పకుండా పాటించాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయుబ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్, దేవయ్య, సంపత్, ఫార్మసిస్ట్ శివ కుమార్, జిఎన్ఎమ్ ఉమా, ఆశ వర్కర్లు లక్ష్మి, సుజాత, లక్ష్మమ్మ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -