డాక్టర్ నిర్లక్ష్యం వలెనే శిశువు మృతి?
బంధువుల ఆరోపణ హాస్పిటల్ ముందు నిరసన..
నవతెలంగాణ – భువనగిరి
ఫ్రెండ్స్ వెటర్నరీ హాస్పిటల్ వైద్యురాలు గర్భిణీ స్త్రీని చూడకుండానే వైద్యానికి సంబంధించిన మందులు ఇవ్వడంతో అధిక రక్తస్రావం జరిగి శిశువు మృతి చెందిందని గర్భిణీ స్త్రీలు బంధువులు ఆరోపించారు. మంగళవారం హాస్పటల్ ముందు యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శిశువు మృత్తికి కారణం డాక్టరే అని కోరుకుంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి యాదగిరిగుట్ట యాదగిరి పల్లికి చెందిన ప్రశాంత్ భార్య తేజస్విని ఏడు నెలల గర్భిణి తనకు కడుపునొప్పి కాళ్ళు నొప్పి వచ్చిందని ప్రిన్స్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చారు. సోమవారం 8 గంటల నుండి 10:30 గంటల వరకు హాస్పటల్లోనే ఉన్నారు.
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సు గర్భిణి కి సంబంధించిన రిపోర్టులను మొబైల్ ద్వారా డాక్టర్కు పంపించింది. రిపోర్టు చూసిన డాక్టర్ ఆమెను నేరుగా చూడకుండానే వివిధ మందులు వాడాలని కోరారు. ఆ మందులు వాడిన తరువాత నర్సు రేపు వైద్యశాలకు రావాలని కోరారు. దీంతో ఇంటికి వెళ్లిన గర్భిణీ కి రక్తస్రావం జరిగి పాప పుట్టింది. తిరిగి వేరే హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అప్పటికే శిశువు మృతి చెందిందని ఇతర హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రిన్స్ హాస్పిటల్ డాక్టర్ సూచించిన మందులు వాడటంతోనే శిశువు మృతి చెందిందని పెద్ద ఎత్తున వారు నిరసన తెలిపారు. రోగిని చూడకుండా మందులు ఎలా రాస్తారు అని ప్రశ్నించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తారని చెప్పడంతో వారు నిరసనను నిలిపివేశారు.
ప్రిన్స్ మెటర్నరీ హాస్పటల్లో వివాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES