Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంన్యాయవ్యవస్థపై 'అవినీతి' వ్యాఖ్యల వివాదం

న్యాయవ్యవస్థపై ‘అవినీతి’ వ్యాఖ్యల వివాదం

- Advertisement -

సుప్రీంకోర్టు మందలింపుతో ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణ
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో ‘అవినీతి’ ఉందని పేర్కొన్న ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి తీవ్రంగా స్పందించడంతో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మంగళవారం బేషరతు క్షమాపణలు ప్రకటించింది. వివాదాస్పద అధ్యాయం ఉన్న పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. కోర్టు చేసిన మౌఖిక వ్యాఖ్యల అనంతరం ఎన్‌సీఈఆర్‌టీ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది.

” ఆ అధ్యాయం విషయంలో జరిగిన తప్పిదానికి ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌, సభ్యుల తరఫున బేషరతు, సంపూర్ణ క్షమాపణలు తెలుపుతున్నాం. ఆ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నాం. ప్రస్తుతం అది అందుబాటులో లేదు” అని ఎన్‌సీఈఆర్‌టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే ఈ ఘటన వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ.. భవిష్యత్తులో విద్యా విషయాల్లో కచ్చితత్వం, సున్నితత్వం, బాధ్యతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -