Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅనువైన భవనంలోకి మార్చండి…

అనువైన భవనంలోకి మార్చండి…

- Advertisement -
  • – ఆహారం నాణ్యంగా ఉంటుందా..?
    – విద్యార్ధులను ఆరా తీసిన మంత్రి
    – ఎంజేపీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి…
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • నియోజక వర్గం పరిధిలో అనువైన భవనం లభ్యం అయితే అందులో కి పాఠశాలను మార్చాలని రెవిన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన భవనం పిల్లలకు  సరిపడినంత సౌకర్యవంతంగా లేకపోవడాన్ని గమనించి అనువైన ప్రాంతానికి మార్చాలని ఆ శాఖ అధికారులను పై విధంగా ఆదేశించారు.
  • స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి గురుకులం లోని వసతులు, సౌకర్యాలు, విద్యార్థులకు అందుతున్న ఆహారం, నీటిసరఫరా,శుభ్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.హాస్టల్‌లో ఉన్న విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను అడిగి సంతృప్తికరంగా ఉన్నారా అని తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న దే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయ మని వారి శ్రేయస్సు కోసం వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ నూతన మెనూ,సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గురుకులం ప్రిన్సిపాల్ నిరోషా,బోధనా సిబ్బందికి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad