నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి అని నాబార్డ్ డిడిఎం ప్రవీణ్ కుమార్ , జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం (IYC–2025) సందర్భంగా శుక్రవారం NABARD ఆధ్వర్యంలో జక్రాన్ పల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NABARD-DDM ప్రవీణ్ కుమార్ , నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్బంగా NABARD DDM ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మొక్కలను నాటడం వలన ప్రయోజనల గురించి వివరించి , సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి అని, దానితో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ DGM లింబాద్రి , అర్గుల్ PACS చైర్మన్ గంగారెడ్డి , బ్రాంచ్ మేనేజర్ బాగారెడ్డి , రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES