Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు అండగా సహకార సంఘాలు: ఎమ్మెల్యే పోచారం

రైతులకు అండగా సహకార సంఘాలు: ఎమ్మెల్యే పోచారం

- Advertisement -

నవతెలంగాణ- బీర్కూర్ (నసురుల్లాబాద్
ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తూ ఆదర్శంగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం బీర్కూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామాల్లో నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 23 లక్షల రూపాయలతో నిర్మించిన సొసైటీ ధాన్యం గోదాం ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ జిల్లాలో 90 శాతం మంది రైతులు వరి సాగు చేస్తూ రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. బాన్స్వాడ నియోజవర్గంలో రైతులు ముందస్తు సాగు చేయడంతో అకాల వర్షం రాకుండానే ముందుగా కోతలు జరుగుతున్నయ్ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని తెలిపారు. గోదాం నిర్మాణానికి నియోజకవర్గ నిధులు, సొసైటీ నిధుల ద్వారా గోదాం నిర్మించడం జరిగిందన్నారు.

రైతుల సౌకర్యార్థం  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో యూరియా, పాస్పేట్, జింక్, పొటాషియం, సూపర్ సల్ఫేట్, తదితర రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలి,సొసైటీ లో ప్రైవేటు మార్కెట్లు భిన్నంగా నిర్ణీత ధరకే విక్రయిస్తుండడంతో రైతులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. సహకార సంఘం అధికారులు సిబ్బంది రైతుల సౌకర్యాలను గుర్తించి వాటి పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలన్నారు. 

ఎమ్మెల్యే సహకారం తీసుకుంటే అభివృద్ధి చేస్తా 
బాన్సువాడ నియోజకవర్గం లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ లు ఎమ్మెల్యే సహకారం తీసుకుంటే గ్రామ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానాని, కొత్త సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ పనిచేయాలని సూచించారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలవాలన్నారు. తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పిన వారందరికీ ఎమ్మెల్యే గా సేవలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్, వైస్ చైర్మన్ రాములు, దామరంచ సర్పంచ్ బోయిని శంకర్, అన్నారం సర్పంచ్ కవిత పండరి, నాయకులు శశికాంత్ , మారుతి పటేల్, కిష్టాపూర్ గంగగొండ, సొసైటీ కార్యదర్శులు జాకీర్, మోహన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -