ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
దేశంలో రైతాంగం చారిత్రాత్మక పోరాటాన్ని నిర్వహించిందనీ, ఆ పోరాట స్ఫూర్తితో మోడీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్ పిలుపునిచ్చారు. సీఐటీయూ అలిండియా 18వ మహాసభలో ఆయన సౌహార్ధ సందేశాన్ని ఇచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాటం ద్వారా మోడీ మొదటిసారి ఓడిపోయారని చెప్పారు. ఉత్పత్తి వర్గాలపై మోడీ ఎక్కుపెట్టిన దుర్మార్గపు చర్యలో భాగమే లేబర్ కోడ్‌లు అని విమర్శించారు.
కోడ్‌లను వ్యతిరేకించేందుకు కార్మికులతో పాటు రైతులు కూడా కదలాలని పిలుపునిచ్చారు. జీ రాం జీ పథకంలో రాష్ట్రాలు 40 శాతం వాటా భరించాలని కేంద్రం చెప్పడమంటే రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలను మోపడమేనని విమర్శించారు. 125 రోజులకు పనిదినాలు పెంచామని గొప్పలు చెప్పుకుంటూనే పెద్ద ఎత్తున ఉపాధి నుంచి కూలీలను వెళ్లగొట్టే కుట్రను మోడీ సర్కారు అమలు పరుస్తున్నదని విమర్శించారు. జీ రాం జీ పథకాన్ని తాము అమలు చేయబోమని తేల్చిచెప్పిన ఏకైక రాష్ట్రం కేరళ అని గర్వంగా చెప్పారు. ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన సమ్మెలో రైతాంగం పాల్గొనాలని పిలుపునిచ్చారు.



