నవతెలంగాణ-మల్హర్ రావు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ప్రభుత్వం..మరింత పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో రాగి జావను అందజేయాలని నిర్ణయించింది. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించింది. ప్రభుత్వం,ఉన్నతా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రాగి జావ అందించ్చినట్లుగా సోమవారం నుంచి ప్రారంభించినట్లుగా మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న రాగిజావాతో మండల వ్యాప్తంగా 38 పాఠశాలల్లో చదువుతున్న 14,078 మంది విద్యార్థులకు రాగిజావ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.అయితే ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు బయలుదేరే చిన్నారులు తరగతి గదుల్లో అలసి పోతున్నారు.ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగిజావ అందజేస్తే ప్రయోజనకరంగా ఉండడంతోపాటు విద్యార్థులు పౌష్టికాహారం అందుతుందని భావించింది.ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది.
బడి పిల్లలకు రాగి జావ పున ప్రారంభం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES