నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లోని నయాబాదిలో గురువారం వేకువజామున పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముధోల్ సీఐ మల్లెష్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలతో కలిసి ఈ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 31 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లను పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగాసీఐ మల్లెష్ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల కోసం పోలీసులు పనిచేస్తారన్నారు. వాహనదారులు విధిగా లైసెన్స్ తో పాటు వాహన సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని అన్నారు.
ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలు పాటిస్తు వాహనాలను నడపాలని సూచించారు. చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని అన్నారు .చెడు వ్యసనాలను మాని యువత సన్మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రుల కలలను సహకారం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేపట్టినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సంఘటన జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవలని సూచించారు. ఈ సందర్భంగా పలు సలాహ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్,తానూర్ఎస్సై జుబేర్, లొకేశ్వరం ఎస్సై అశోక్ ,బాసర ఎస్సై శ్రీనివాస్, గంగదర్ తో పాటు సుమారు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు



