నవతెలంగాణ – బజార్ హాత్నూర్
శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందు నాయక్ తండ గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి. శాంతిభద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని, ఎవరైనా గంజాయి పండించిన అమ్మిన పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో అనుమానస్పద బైకులు 29, ఐదు ఆటో లను స్వాధీనం చేసుకొని పరిశీలించగా రెండు ద్విచక్ర వాహనాలపై డిడి కేసులు, రెండు బైకుల సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా 84 ద్విచక్రహనాల పై పెండింగ్ లో ఉన్న చాలన్ రూపాయలు 23 వేల 985 చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గురుస్వామి, ఎస్సై సంజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



