పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాల వ్యాన్ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి తోనే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రైతులు పండించిన మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర ఉండి రైతు ఆర్థికంగా లాభం పొందాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. బుధవారం వ్యవసాయ సహకార పరపతి సంఘం , మార్క్ ఫెడ్ స్థానిక సర్పంచ్ పులి వెంకన్న పీఏసీఎస్ నెల్లికుదురు ఇంచార్జి మనోహర్ రావు తహసిల్దార్ చందా నరేష్ మండల వ్యవసాయ అధికారి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తున్నారని దానికి మద్దతు ధర ఉండి రైతు ఆర్థికంగా లాభం పొందాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో పేదవారు ఉన్నారని అన్నారు.
వెంటనే స్పందించి మాకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. అడగగానే వెంటనే స్పందించిన మంత్రికి మరియు ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజల తరఫన కృతజ్ఞతలు అన్నారు. అంతేకాకుండా శ్రీరామగిరి మరియు ఎర్రబెల్లి గూడెం ప్రాంతంలో కూడా వేరే కొనుగోలు కేంద్రాల సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. రైతులు మధ్య దళారల చేతిలో మోసపోకూడదని ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని దీన ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీఈవో యాదగిరి ఏఎంసీ డైరెక్టర్లు

ప్రభుత్వ పాఠశాల వ్యాన్ ప్రారంభం
మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మండలంలోని ఒక దాత ముందుకు వచ్చి వ్యాన్ అందించారు అది బుధవారం ప్రారంభిస్తున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. ఆ గ్రామ సర్పంచ్ ఎదల పూలమ్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుత్యం నరేంద్ర కుమార్ తో కలిసి మాట్లాడుతూ ఈ పాఠశాలకు రూ ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ గల ఒక వ్యాన్ ఫ్రీగా అందించడం అభినందనీయమని అన్నారు. అందించిన వెంకన్నకు కృతజ్ఞతలు అని తెలిపారు.
కానీ ఈ రోజుల్లో గోరంతా చేసి కొండంత పబ్లిసిటీ కావాలని చూస్తారు కానీ కొండంత చేసి గోరంత కూడా నా పేరు వద్దు. నా ఊరు వద్దు అని చెప్పవద్దని అనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అంత మంచి వ్యక్తి ఈ పాఠశాలకు వ్యాన్ అందించడం పట్ల అతనికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ పాఠశాల రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని ఈ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన కృషి గొప్పదని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అడ్మిషన్ పెంచాలని సూచించారు. ఈ పాఠశాల ప్రహరీ గోడ మరియు పిల్లలకు రెండు రూములు కావాలని అడిగారని వాటిని కూడా త్వరలో మంజూరు ఇప్పిస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు చెప్పారు. మొదటగా ఆరు నెలల లోపే ప్రహరీ గోడను మంజూరు చేసి ఇస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు నాయిని సత్యబాల్ రెడ్డి బాలాజీ నాయక్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ గుదే యుగంధర్ ఇట్టే దేవేందర్ రెడ్డి ధారావత్ భాస్కర్ గుగులోతు శ్రీను వాస్ గుగులోతు వాసు అమృనాయక్ అశోక్ యాకాంతం తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.



