Saturday, May 24, 2025
Homeట్రెండింగ్ న్యూస్చాప‌కింద నీరులా క‌రోనా విస్త‌ర‌ణ‌..

చాప‌కింద నీరులా క‌రోనా విస్త‌ర‌ణ‌..

- Advertisement -

భార‌త ప్ర‌భుత్వం అల‌ర్ట్..
న‌వ‌తెలంగాణ‌ – హైద‌రాబాద్:
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలని.. పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే హోమ్ క్వారంటైన్ కావాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 257 మంది కరోనా లక్షాణాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అధికంగా కేరళ రాష్ట్రంలో 95 మంది, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 మంది, కర్ణాటకలో 13 మంది, పుదుచ్చేరిలో 10 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి ఉందని, కానీ తీవ్రమైన హాని కలిగించే అవకాశం లేదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించడంతో పాటు నివారణ చర్యలు పాటించాలన్నారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -