Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో మళ్ళీ కరోనా కలవరం..

ఏపీలో మళ్ళీ కరోనా కలవరం..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా మూడు కేసులు బయటపడటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -