Thursday, December 4, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న కార్పొరేట్ శక్తులు

రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న కార్పొరేట్ శక్తులు

- Advertisement -

సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకూలంగా పనిచేస్తుందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిరిసిల్ల సిపిఐ పార్టీ భవన్ లో  జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాదనాన్ని సైతం అప్పగిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ఉండి, స్థానికంగా వుంటూ ప్రజలకు సేవ చేసే వారినే గెలిపించాలని, నిజాయితీ, ప్రజల కోసం ఆలోచన చేసే వారినే గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ఆదివాశిలను లొంగిపోండి లేదా చంపుతామనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణ ను కించపరిచే విదంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద. సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, కౌన్సిల్ సభ్యులు వడ్డెపెల్లి లక్ష్మన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -