అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలడంతో కలెక్టర్ చర్యలు
మందలించిన జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్
నవతెలంగాణ-హన్మకొండ:-
హన్మకొండ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మధుసూదన్(ఎఫ్‌ఏఓ) అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. హన్మకొండ జిల్లా విద్యాశాఖకకు సరెండర్ చేశారు. సదురు అవినీతి అధికారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. తప్పుడు మార్గంలో ప్రయత్నించి వెంటనే జయశంకర్ భూపాలపల్లి డీఈఓ కార్యాలయంలో తిరిగి విధుల్లో చేరాడు. అవినీతి అధికారికి మళ్లీ పోస్టింగ్ అనే కథనంతో పత్రికల్లో వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని చూసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మధుసూదన్‌ను మందలించారు. అంతే కాకుండా డీఈఓగా రిలీవ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సదరు అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ కేజీబీవీ పాఠశాలలను, ఆర్థికపరమైన బిల్లులతో సంబంధమున్న వారంతా కూడా అవినీతి అధికారి గురించే చర్చించుకుంటున్నారు. గతంలోనూ అవినీతికి పాల్పడడంతో విచారణ నిమిత్తం కమిటీ కూడా వేశారు. ముడుపులు అప్పజెప్పి తన అవినీతి గుట్టు వెలుగు చూడకుండా ఉండేందుకు కప్పిపుచ్చుకున్నట్లు సమాచారం.
విధుల్లో చేరిన మరుసటి రోజే రిలీవ్?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



