Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవినీతి, అరాచకం కాంగ్రెస్‌ జోడెడ్లు

అవినీతి, అరాచకం కాంగ్రెస్‌ జోడెడ్లు

- Advertisement -

– గులాబీ జెండాపైనే ప్రజల విశ్వాసం
– కేసీఆర్‌ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయం : కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అవినీతి, అరాచకమే కాంగ్రెస్‌ పాలన జోడెడ్లు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెస ిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. శువ్రారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన అలం పూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లను కేటీఆర్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అలంపూర్‌, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్‌ఎస్‌పైనే ఉందని చెప్పారు. సర్పంచ్‌ ఎన్నికల నుంచి మున్సిపల్‌ ఎన్నికల వరకు మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్‌ లాకప్‌ డెత్‌ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలని ఆక్షేపించారు. కేసీఆర్‌ నాయకత్వంలో గతంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని గుర్తు చేశారు. చెక్‌ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్లు నరకడం వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరి చిందని చెప్పారు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్‌ నిజ స్వరూపం అర్థమైంద న్నారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్‌ పిలుపుని చ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కేసీఆర్‌ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -