- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. హెచ్‌సీఏలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందంటూ క్రికెట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.70 కోట్లు చెల్లించారని మండిపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పందించి.. చెల్లింపుల వెనుక తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో మంగళవారం సికింద్రబాద్‌లోని జింఖానా మైదానంలో గందరగోళం చోటుచేసుకుంది. రూ.70 కోట్ల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెస్‌మీట్‌ను క్రికెట్ సంఘాలు అడ్డుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన జింఖానా మైదానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



