– ఉపాధి హామీ పథకం విరుద్ధంగా కేటాయింపులు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఉపాధి హామీ అంటేనే గ్రామీణ పేదలకు కూలీ పనికల్పించి వారికి వేతన భరోసా కల్పించడం.కానీ రానురాను ఈ పధకంలో విధాన నిర్ణయానికి విరుద్ధంగా వేతనాలకు తక్కేకువగా, మెటీరియల్స్ కు ఎక్కువ గా కేటాయింపులు జరుగు తున్నాయి అనేది స్పష్టం అవుతోంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16 రౌండ్ సామాజిక తనిఖీ లో భాగంగా మండలంలో 01/04/2024 నుండి 31/03/2025 వరకు చేపట్టిన పనులు పై తనిఖీ లు చేపట్టారు.
మండలంలోని 30 పంచాయతీ లో మొత్తం పనులు మరియు వ్యయం ఈ విధంగా ఉంది.
మొత్తం పనులు: 492
మొత్తం వ్యయం: రూ.11,39,42,441
విభాగాల వారీగా ఖర్చు వివరాలు :
విభాగం వేతనాలు మెటీరియల్ మొత్తం
ఈజీఏ 4,95,83,776 17,30,004 5,13,13,780
పీఆర్ 20,735 6,23,55,685 6,23,76,440
అటవీశాఖ. 1,12,734 1,39,487 2,52,221
మొత్తం 4,97,17,245 6,42,25,17 11,39,42,441
ఈ పరిశీలనలో మొత్తం వ్యయం లో వేతనాలకు సుమారు రూ.4.97 కోట్లు కాగా మెటీరియల్ కు సుమారు 6.42 కోట్లు వ్యయం చేసారు.
వాస్తవానికి ఈ పథకం లో వేతనాలు : మెటీరియల్ నిష్పత్తి 60:40 ఉండాలి (అంటే వేతనాలు ఎక్కువ ఉండాలి),కానీ ఇక్కడ చూస్తే వేతనాలు ≈ 44%,మెటీరియల్ ≈ 56% ఉంది.
ఇది పథకం నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది (సామాజిక తనిఖీలో ఇది ప్రధానంగా పరిశీలించే అంశం). సామాజిక తనిఖీ లక్ష్యం ఏంటంటే పనులు నిజంగా జరిగాయా?కార్మికులకు పూర్తి వేతనాలు ఇచ్చారా? మెటీరియల్ కొనుగోళ్లు నిబంధనల ప్రకారం జరిగాయా? ఎక్కడైనా అవినీతి లేదా అక్రమాలు జరిగాయా? అనేది తేలుస్తారు.
ఈ సామాజిక తనిఖీల ద్వారా ప్రజాధనం ఎంత సద్వినియోగం అయింది? ఎంత దుర్వినియోగం జరిగింది? అనే విషయం స్పష్టంగా బయటపడుతుంది.”



