Thursday, October 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వర్షాలతో దెబ్బతింటున్న పత్తి, సొయా పంటలు...

వర్షాలతో దెబ్బతింటున్న పత్తి, సొయా పంటలు…

- Advertisement -

– ఆందోళనలో రైతులు… తడిసి ముద్దయితున్న పంటలు
నవతెలంగాణ – కుభీర్ : కుబీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రైతులు సొయా అరబెట్టగా బుధువారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా సొయా గింజలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది. దింతో తడిసిన ధన్యన్ని ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు. అరుగాలం కష్ట పడి పండించిన పత్తి, సొయా పంటలు గత ముడు నాలుగు రోజుల నుంచి మండలంలో భారీ వర్షాలు కురావడంతో పంటలు పూర్తిగా దెబ్బతినడం జరిగింది.దింతో రైతులు వన అనక ఎండనక కష్ట పడి పండించిన పంటలు తడిసి పోవడం చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుభీర్ మండలంలో దాదాపుగా 22వేల ఎకరలో సొయా, పత్తి24వేల ఎకరలో పంటలు సాగుచేయడం జరిగింది.ముఖ్యంగా మండలంలో పత్తి తర్వాత సొయా రెండు పంటలు సాగు విస్తీర్ణం లో చేస్తారు. ఇప్పటికే గత నెలలో కురిసిన వర్షాల కారణాల వల్ల సొయా పంట పూర్తిగా దెబ్బతిని రైతులకు ఆర్థిక నష్టన్ని మిగిలించింది. ఐతే ఉన్న కాస్త పంటలను అమ్ముకోవడానికి ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

దింతో రైతులు చేసేది ఏమి లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధర కు అమ్మి మోసపోతున్నారు.ఇదే క్రమంలో పత్తి పంట ను సాగు చేస్తున్న రైతులు వర్షాలతో పత్తి తీసేందుకు కూలీలు దొరకక వర్షానికి నానిపోయి రంగు మరే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.దింతో ఏరిన పత్తిని అమ్ముకోవడానికి కచ్చితంగా కిసాన్ యాప్ లో వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారాని అన్నారు.పత్తి పంటను సాగుచేసిన రైతులు కిషన్ యాప్ లో నమోదు చేసిన తరవాతే సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోళ్లు కేంద్రలో పత్తిని విక్రహించే అవకాశం ఉంది.దింతో పత్తి సొయా పంట రైతులు ఈ ఏడాది లో కష్టాలు తప్పడం లేదని రైతులు కంటి తడి పెట్టుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -