Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి పంట ద్వారా రైతులకు జీవనాధారం

పత్తి పంట ద్వారా రైతులకు జీవనాధారం

- Advertisement -

– భారత నవనిర్మాణ సంస్థ కో-ఆర్డినేటర్ దాతర్ పల్లి భాస్కర్
నవతెలంగాణ- రాయపోల్

పత్తి పంట ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు జీవనాధారం ఇస్తుందని వ్యవసాయం నుంచి వస్త్ర పరిశ్రమ వరకు అనేక రంగాలలో ఉపాధి కల్పిస్తుందని పత్తి పంటను తెల్ల బంగారమని అంటారని భారత నవ నిర్మాణ సంస్థ కో ఆర్డినేటర్ దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం రామారం గ్రామంలో ప్రపంచ పత్తి దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకోవడం ద్వారా పత్తి పంట యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటామన్నారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ 2019 లో మొదటిసారి ప్రపంచ పత్తి దినోత్సవం ప్రారంభించింది. ఈ దినోత్సవం ఉద్దేశ్యం పత్తి యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం, పత్తి రైతులను శక్తివంతం చేస్తు, పత్తి ఉత్పత్తిని సుస్థిరంగా అభివృద్ధి చేయడమన్నారు. భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద పత్తి ఉత్పత్తి దేశాల్లో ఒకటి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా పత్తి పండించబడుతోందన్నారు.పత్తి పంట వలన మనకు వస్త్రాలు మాత్రమే కాకుండా, పత్తి విత్తన నూనె, పశువుల ఆహారం వంటి అనేక ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి సహజమైన, బయోడిగ్రేడబుల్ అయిన పంట కావడం వల్ల పర్యావరణానికి మేలు చేస్తుంది.ఈ  కార్యక్రమంలో పియు మేనేజర్ కల్పన, ఫీల్డ్ ఫెసిలిటీర్స్,కరుణాకర్, శ్రీకాంత్, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -