కాటారం సబ్ డివిజన్లో పుట్టగొడుగుల్లా చిల్లర దళారులు
అడ్డగోలుగా దోసుకుంటున్న చిల్లర దళారులు
సీ సీ ఐ కొనుగోలు కేంద్రాల కోసం రైతన్నల ఎదురుచూపు
నవతెలంగాణ – కాటారం
కాటారం సబ్ డివిజన్ పరిధిలో పత్తి సేకరణ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీ సీ ఐ) కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో జాప్యం పత్తి రైతులను నిండా ముంచుతుంది. పత్తిని సేకరించి విక్రయానికి సిద్ధం చేసిన రైతులు సీసీఐ రాక కోసం ఎదురు చూస్తుండగా అప్పులు తీర్చాల్సిన మరికొంతమంది రైతులు ప్రవేటి వ్యాపారులకు తక్కువగా రేటు కు అమ్ముకుంటున్నారు. దీంతో మండలంలో అనేక గ్రామాల పరిధిలోని చిల్లర కాంటల దళారులు పుట్టగొడుగుల రైతులను పీల్చి పిండేస్తున్నారు. మండలం లో వానకాలం సీజన్లో సుమారుగా 12వేయిల నుండి 15 వేయిల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అతి అన వృష్టితో పత్తి దిగుబడి పత్తి దిగుబడి 30%శాతనికి తగ్గిపోయింది. గత రెండు నెలలుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఉన్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలని ఉద్దేశంతో నెలరోజుల నుంచి తెల్ల బంగారం సేకరణ ప్రారంభించారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ సెంటర్లకు ప్రారంభించాలని రెండు వారాలుగా కసరత్తు చేస్తున్నారు.మండలంలోని సీసీఐ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ప్రారంభోత్సవం ఆలస్యం కావడంతో కొనుగోలు ప్రక్రియ నేటికి ప్రారంభం కాలేదు.
జోరుగా చిల్లర దళారుల కాంటాలు…
సీసీఐ సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో మండల వ్యాప్తంగా చిల్లర దళారులు ఎక్కడపడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. వీటిని కొంతమంది దళారులు నడుపుతూ రైతులని మోసం చేస్తున్నారు. చిల్లర కాంట వద్ద పత్తి కింటాలుకు 5000 నుండి 6000 వరకు మాత్రమే ధర పలుకుతుంది. సీసీఐ సెంటర్లు లేక రైతులు విధిలేని పరిస్థితిలో అమ్ము కుంటున్నారు. క్వింటలు పత్తి కి రూపాయలు 3000 నుండి 2000 తక్కువ కు అమ్ముకుంటూ తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. ప్రవేటి కొనగోళ్ల ద్వారా సేకరించిన పత్తిని బినామీ రైతుల పేర్లతో సీసీఐ సెంటర్లకు తరలించేందుకు కొంతమంది దళారులు తెరవెనుక కథ నడిపిస్తున్నట్టు సమాచారం. చిల్లర కాంటాలను అదుపు చేయాల్సిన అధికారులు మాత్రం గప్ చుప్ గా ఉండిపోతున్నారని విమర్శలు ఉన్నాయి.
తేమశాతంపై ఆధారపడి ధర నిర్ణయం
సీసీఐ సెంటర్లో 8% తేమ కలిగిన పత్తికి క్వింటాలుకు రూపాయలు 8,110 రూ. మద్దతు ధర చెల్లించనున్నారు. 12% శాతం వరకు తేమగా ఉన్న పత్తికి కింటాలుకు ఒక శాతానికి 8110రూ. చొప్పున తగ్గింపుతో చివర రూ. 7,785. 60 రూ. కొనుగోలు చేస్తారు. రైతులు నష్టపోకుండా దళారుల దందాను అడ్డుకట్ట వేయాలంటే వెంటనే సీ సీ ఐ సెంటర్లను ప్రారంభించాలని రైతు సంఘాలు రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా సకాలంలో ప్రారంభించాలన్నారు.
రెక్కల కష్టం కూడా మిగలడం లేదు
– పాగే సురేష్ దేవరాంపల్లి రైతు
సీసీఐ కొనుగోలు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అడ్డుకి పావు సేరు దళారులకు అమ్ముకున్న. నాకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాను. పెట్టుబడులకు సుమారుగా 60వేయిల వేల నుండి 80 వేల రూపాయలు ఖర్చయింది. సీసీఐ సెంటర్ అందుబాటులో ఉంటే క్వింటాలుకు రూపాయలు 8000 పైన ధర వచ్చేది.ఇప్పటివరకు సీ సీ ఐ సెంటరు ప్రారంభించకపోవడంతో దిక్కులేని పరిస్థితిలో ప్రైవేట్ దళారులకులో అమ్ముకుంటే కింటాలుకు 6000 ఇచ్చారు. 15 కింటల్లా దిగుబడిలాగా పెట్టుబడి ఖర్చులకు సరిపోయింది.అదే సీసీఐ సెంటర్ ఉంటే మరో 20వేలు నుంచి 30 వేలు మిగిలి ఉండేది



