Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప‌త్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప‌త్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
 ప్రతి ప‌త్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని   వ్యవసాయ విస్తరణ అధికారులు ఆంజనేయులు,స్వాతి అధికారి పఅన్నారు. మంగళవారం పెద్దవూర రెవెన్యూ పరిధిలోని పెద్దవూర లో ఉన్న ప‌త్తి పంటలను వారు  పరిశీలించారు. అనంతరం  సహాయ వ్యవసాయం సంచాలకులు మాట్లాడారు. ప‌త్తి రైతు తాను పండించిన పంట వివ‌రాల‌ను క‌పాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా పంట వివ‌రాలు న‌మోదు చేయాలో స్వ‌యంగా రైతుల‌కు చూపించారు. రైతులే స్వయంగా సిసిఐకి త‌మ ప‌త్తి పంట‌ను అమ్మి మద్దతు ధర పొందవచ్చు అని తెలిపారు.

ఒకవేళ సరైన మొబైల్ నెంబర్ లేకపోతే ఏఈఓను,సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి సరైన నంబ‌ర్‌ను నమోదు చేసుకోవాలన్నారు. ఈ యాప్‌ను రైతులు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని తమ యొక్క మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి, స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ బుక్ అయిన తేదీ నాడు మాత్రమే మిల్లుకు పత్తిని తీసుకొని రావాలని అన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండా వెళ్తే పత్తి కొనుగోలు చేయుటకు అవకాశం లేదని తెలిపారు. పత్తి వేసిన రైతుల ఫోన్ నెంబర్లు యాక్టివేషన్ లేని వారు ఫోన్ నెంబర్ అప్డేషన్ కోసం మీ వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గరికి వెళ్లి చేయించుకోవాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -