కాటారం మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ
నవతెలంగాణ – కాటారం
పత్తి రైతులు “చిల్లర దళారుల” దోపిడికి గురికాకుండా ఉండేదెందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “కపాస్ కిసాన్” యాప్ ను రైతులు ఉపయోగించు కోవాలని కాటారం మండల వ్యవసాయాధికారిణి పూర్ణిమ సూచించారు.మంగళవారం కాటారం రైతు వేదిక లో వ్యవసాయ మంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రైతులతో మాట్లాడుతూ…
పత్తి పంట సాగు చేసిన రైతులు కిసాన్ యాప్ నందు స్లాట్ బుకింగ్ కొరకు ముందుకు ఏఇవో దగ్గర తమ యొక్క మొబైల్ నెంబర్ పంట సాగు వివరాలలో తప్పుగా ఉంటే ప్రస్తుతం తమ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి పంటను అమ్ముకొనుటకు వీలు కాదు పత్తి పంట అమ్ముకోవడానికి ముందుగా తమ క్లస్టర్ ఏఇవో దగ్గర మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవాలన్నారు. సాగు వివరాలలో ఉన్న నెంబర్ ద్వారా ముందుకు లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి రాని రైతులు తమ దగ్గరలో ఉన్న రైతుల ద్వారా,మీసేవ,సిఎస్సి సెంటర్,తమ క్లస్టర్ పరిధిలోని ఏఇవో దగ్గర కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.బుక్ చేసుకున్న.తేదీన పత్తి పంటను సిసిఐకి తీసుకొని పోవడానికి వీలు కానీ యడల బుక్ చేసుకున్న స్లాట్ నీ కాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
పత్తి రైతులు “కపాస్ కిసాన్ ” యాప్ ని ఉపయోగించు కోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



