Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి కొనుగోళ్ల బంద్‌ తాత్కాలికంగా వాయిదా

పత్తి కొనుగోళ్ల బంద్‌ తాత్కాలికంగా వాయిదా

- Advertisement -

12 శాతం మ్యాచర్‌ రాదు.. సీసీఐ పత్తి కొనుగోలు చేయదు
దళారుల చేతుల్లోకి పత్తి


నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలను నిరసిస్తూ గురువారం నుంచి తలపెట్టిన కొనుగోళ్ల బంద్‌ వాయిదా పడింది. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 కేటగిరీలలో అలాట్‌మెంట్‌ కపాస్‌, యాప్‌ రిజిస్ట్రేషన్‌, తేమ శాతం పరిమితి వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని డిమాండ్‌ చేస్తూ నిర్ణయించిన నిరవధిక బంద్‌ను వాయిదా వేసుకోవాలన్న సర్కార్‌ విజ్ఞప్తి మేరకు పత్తి కొనుగోళ్ల బంద్‌ను తాత్కాలికంగా విరమి స్తున్నట్టు తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

జిన్నింగ్‌ ఇండిస్టీస్‌ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సాను కూలంగా ఉన్నదని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సురేంద్రమోహన్‌ ప్రకటించారని తెలిపింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడితే సాను కూలంగా స్పందించారని.., బీహార్‌ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున తొందర్లోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ తెలిపినట్టు అసోసియేషన్‌ నాయకులు పేర్కొంటు న్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ బంద్‌కు వెళ్తామని హెచ్చరించారు.

12 శాతం మ్యాచర్‌ రాదు..
సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయాలంటే 12 శాతం లోపు తేమ ఉండాలి. నిత్యం కురుస్తున్న వర్షాలు.. ఎండ తక్కువగా ఉండటంతో పత్తిని ఆరబోసినప్పటికీ తేమశాతం 12 శాతం లోపు రావడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కపాస్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ తీసుకున్న తర్వాత పత్తిని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా.. సీసీఐ అధికారులు పరిశీలించి తేమ ఎక్కువ ఉందని కొనుగోలు చేయడం కుదరదని తేల్చి చెప్తున్నారు. కాటన్‌ మిల్లుల వద్ద ప్రతిరోజూ 50 నుంచి 60 వాహనాలు వస్తున్నప్పటికీ అందులో నలుగురికి మాత్రమే తేమ 12 శాతంలోపు ఉంటుంది. తేమశాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపడం ద్వారా అదనంగా రవాణా ఖర్చులు మీద పడటంతో పాటు సమయం వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తేమశాతం రావడం లేదని కొనుగోలు చేయడం లేదు : రైతు జడల రవి, తుమ్మలగూడెం, నార్కట్‌పల్లి మండలం
రెండు నెలల కిందట పత్తిని ఏరి ఎండలో ఆరబెట్టాం. కపాస్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని చౌడంపల్లి గ్రామ శివారులో ఉన్న వరలక్ష్మి కాటన్‌ మిల్లుకు పత్తిని తీసుకెళ్తే.. 22 శాతం తేమ ఉందని సీసీఐ అధికారులు కొనుగోలుకు నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -