- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి 
పత్తి పంట అమ్మకం విషయంలో రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆధీనంలో కొనుగోలు చేసే సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రైతులకు సూచించారు. మండలంలోని మేళసంఘం వద్ద కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆయన శుక్రవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రం వల్ల అనేక మండలాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు జొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిసిఐ అధికారి వరుణ్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    