– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు సన్మానం
నవతెలంగాణ- ఆత్మకూర్
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), వామపక్షాలు బలోపేతం అయ్యేలా కృషి చేయా లని, కౌన్సిలర్లు, చైర్మెన్ స్థానాలను గెలిపించు కోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కార్యకర్తలకు సూచించారు. వనపర్తి జిల్లా అమర చింత పట్టణంలోని జియస్ భవనంలో శుక్రవారం పామిరెడ్డిపల్లి సర్పంచ్ కుర్వ బాలయ్య, ఉప సర్పంచ్ వెన్నెల మోహన్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం పై జాన్‌వెస్లీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), వామపక్షాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పని చేయాలని కోరారు. కౌన్సిలర్లు, చైర్మెన్ స్థానాలను గెలుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే.. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో పెట్టడం సరైంది కాద న్నారు. బీసీల 42శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమో దింపజేయటంలో బీజేపీ నేతలు శ్రద్ధ చూపటం లేదన్నారు. రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల్లో బీసీల 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల న్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎండి. మహమూద్, అమర చింత మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మెన్ జియస్ గోపి, నాయకులు బి.వెంకటేష్. యస్.అజరు, టి.రాఘవేంద్ర, శ్యామ్ సుందర్, దేవర్ల మోహన్, నందిమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో కౌన్సిలర్, చైర్మెన్ స్థానాలు గెలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



