Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికులకు రంజాన్ విందు ఇచ్చిన కౌన్సిలర్ 

మున్సిపల్ కార్మికులకు రంజాన్ విందు ఇచ్చిన కౌన్సిలర్ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 23వ వార్డు  కౌన్సిలర్ యూనుస్  తన నివాసంలో ప్రత్యేక దావత్ ఏర్పాటు చేసి మున్సిపల్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ యూనుస్  మాట్లాడుతూ.. “మున్సిపల్ సిబ్బంది సహకారంతోనే వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాను. మీ అందరి సహకారం కొనసాగితే నా వార్డ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను  ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను” అని అన్నారు.

 నాయకులు కాట్రియాల ప్రభు, ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో ఏ కౌన్సిలర్ కూడా మున్సిపల్ సిబ్బందిని ఇంటికి ఆహ్వానించి సన్మానించడం జరగలేదని, ఈ కార్యక్రమం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. యూనుస్ కు, వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వాటర్ సప్లై ఇన్‌చార్జ్ లింగం, ఎలక్ట్రిషన్, యూనియన్ నాయకులు ప్రభాకర్, ప్రభు, వార్డ్ ఆఫీసర్ వినయ్, ప్రకాష్, సానిటరీ జవాన్లు, వాటర్ మ్యాన్ ఎస్.కే. పాషా, ట్యాంకర్ డ్రైవర్ సుదర్శన్, శ్రీకాంత్, మిత్రులు కుమార్, రాజేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -