నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని గాండ్లగూడెం,అనంతారం పంచాయితీ లో మహిళా ప్రజాప్రతినిధులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అశ్వారావుపేట మున్సిపాలిటీ 14 వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ భూక్యా ఉదయజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అవుతారు సర్పంచ్ భూక్యా అనూష,వార్డు సభ్యులు తిరుపతమ్మ, సరోజిని,ఉమా,పొట్టమ్మ లకు శాలువాలు కప్పి,చీరలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా మహిళలు పరస్పరం అభినందనలు తెలియజేసుకుని మిఠాయిలు పంచుకుని మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ డాక్టర్ భూక్య ఉదయజ్యోతి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.నేటి సమాజంలో మహిళలు ఉద్యోగాలు,రాజకీయాలు సహా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు. ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ భూక్య ప్రసాద్,గాండ్లగూడెం బీఆర్ఎస్ కార్యకర్తలు కొనసోతు నవీన్, వంశీ నాయక్, శ్రీను, రమేష్, శివాజీ, కనకారావు, శోభన్, వినోద్, కిషోర్, సుధాకర్, వెంకటేష్, రాంజీ, బదియ, గాంధీ తదితరులు పాల్గొన్నారు.



