నవతెలంగాణ-రాయికల్
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాయికల్ బీజేపీ కౌన్సిలర్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి సమక్షంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తన సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి, కౌన్సిలర్లు కల్లెడ ధర్మపురి, వేముల మౌనిక, కునారపు మానస, తోపారపు ప్రశాంతి, పుర్రె శ్రీధర్ పాల్గొన్నారు.
ఎంపీ అరవింద్‌ను కలిసిన కౌన్సిలర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



