Sunday, February 8, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజా పక్షం వహించే వారే కౌన్సిలర్లు కావాలి

ప్రజా పక్షం వహించే వారే కౌన్సిలర్లు కావాలి

- Advertisement -

– ఎమ్మెల్యే జారె
– ప్రజాసమస్యలపై పోరాడేదే కమ్యూనిస్టులు
– సీపీఐ (ఎం) నేత పుల్లయ్య
– హోరెత్తిస్తున మున్సిపల్ ప్రచారం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో 24 గంటలే గడువు ఉండటంతో మైక్ ల హోరు,నాయకుల హామీ ల జోరు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ – సీపీఐ (ఎం) పొత్తు ధర్మాన్ని తూచ పాటిస్తూ ఉమ్మడి అభ్యర్ధుల విజయం కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, తుమ్మ రాంబాబు,సీపీఐ (ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య, చిరంజీవిలు కంకణం కట్టుకుని మరీ ప్రచారు చేయిస్తున్నారు.ఆదివారం అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, పుల్లయ్య లు 2,21 వార్డుల్లో ఓటరు లకు అభ్యర్థులను పరిచయం చేస్తూ ప్రచారం నిర్వహించారు.21వ వార్డులో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల, 2వ వార్డులో సీపీఐ(ఎం) మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుమల్లి మౌనిక పోటీచేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక వీధుల్లో రోడ్లు బాగుండాలన్నా, శుద్ధి చేసిన మంచినీరు సకాలంలో రావాలన్నా, డ్రైనేజీ కాలువలు శుభ్రంగా ఉండాలన్నా, ప్రజలకు ఉపయోగకరమైన పనులు కావాలంటే ప్రజల మాట విని పని చేసే వారే కౌన్సిలర్లు కావాలన్నారు. కాంగ్రెస్ సిపిఐ(ఎం) అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీపీఐ (ఎం) శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -