ముందంజలో బీఎన్పీ.. ప్రధాని రేసులో తారిక్ రెహమాన్
ఢాకా : బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ పూర్తయింది.ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. అప్పటి ప్రధాని హసీనాను గద్దెదించాక..తోలిసారి జరుగుతున్న ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖాలిదా జియా తనయుడైన తారిక్ రెహమాన్ యొక్క బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), జమాత్-ఇ-ఇస్లామి పార్టీ చీఫ్ షఫీకర్ రెహమాన్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి మధ్య ప్రత్యక్ష పోటీగా పరిగణిస్తున్నారు..అయితే బరిలోఉన్న బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి పదవికి ముందంజలో ఉన్నారని ఫలితాలు వస్తున్నాయి.
2024 తిరుగుబాటు వెనుక విద్యార్థి నాయకులు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ)తో సహా జమాత్ నేతృత్వంలోని కూటమి కూడా ఆశించిన ఫలితాలు రావచ్చని అంచనా. పార్లమెంటులో 350 మంది ఎంపీలు ఉండగా.. వీరిలో 300 మంది ఏక సభ్య నియోజకవర్గాల నుంచి నేరుగా ఎన్నికవుతారు, అదనంగా 50 సీట్లు మహిళలకు రిజర్వ్ చేశఆరు. ఓ అభ్యర్థి మరణం కారణంగా 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి పదవీకాల పరిమితులు, కార్యనిర్వాహక అధికారంపై బలమైన తనిఖీలు, పార్లమెంటరీ అధికార ఏకీకరణను నిరోధించే ఇతర రక్షణలు వంటి రాజకీయ సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగిందని ఆయా పార్టీల నేతలు వివరించారు.



