- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీలను ఈ రోజు (గురువారం) లెక్కించనున్నారు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో 827 హుండీలను ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికే ఆర్టీసీ కార్గోలో హనుమకొండకు తరలించారు. నగదు, బంగారు, వెండి, విదేశీ కరెన్సీలను లెక్కించి, అక్కడే బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు. ఈ ఆదాయం నుంచి పూజారులకు ప్రభుత్వం వాటా ఇస్తుంది.
- Advertisement -



