పరిస్థితి విషమం..
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ శివారులో దంపతులు కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నాకు పాల్పడ్డారు. విషం సేవించిన ఘటన శనివారం సాయంత్రం సంచలనం సృష్టించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, విషం సేవించిన దంపతులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీకి చెందిన ఆలకుంట రవితేజ (21), అతని భార్య శోభ అలియాస్ లతా (20) వీరి వివాహం సుమారు మూడు నెలల క్రితమే జరిగినట్లు పోలీసులు తెలిపారు. విషం సేవించిన అనంతరం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, బాధితులు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆర్మూర్ లో దంపతుల ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



