Sunday, February 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకారులో ప్రేమజంట అనుమానాస్పద మృతి

కారులో ప్రేమజంట అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: లాక్ చేసి ఉన్న కారులో ఒక యువకుడు, యువతి తుపాకీ గాయాలతో మరణించి కనిపించడం నోయిడాలో తీవ్ర కలకలం రేపింది. ప్రియురాలిని కాల్చి చంపి, ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇది పరువు హత్య కావచ్చనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నోయిడా సెక్టార్ 107లో అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చి చూడగా, కారు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అద్దాలు పగలగొట్టి చూడగా ఢిల్లీకి చెందిన సుమిత్ కుమార్ (32), నోయిడా వాసి అయిన రేఖ (28) తలలకు బుల్లెట్ గాయాలతో విగతజీవులుగా పడి ఉన్నారు. సుమిత్ చేతిలో ఒక పిస్టల్ లభించింది. పోలీసుల కథనం ప్రకారం సుమిత్ ఫోన్‌లో లభించిన ఒక వాట్సాప్ సందేశంలో… 15 ఏళ్లుగా ప్రేమించుకున్న రేఖ, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉంది. అయితే, మృతురాలి కుటుంబం మాత్రం సుమిత్ తమ కుమార్తెను వేధించేవాడని, కులాలు వేరు కావడంతో తాము ఆమెకు వేరే సంబంధం చూస్తున్నామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -