- Advertisement -
నవతెలంగాణ – ఆమనగల్ : సైబరాబాద్ సీపీ చేతుల మీదుగా ఆమనగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కోర్టు కానిస్టేబుల్ వై.యాదయ్య అవార్డు అందుకున్నారు. తన విధులలో భాగంగా సెషన్ కోర్టు పరిధిలో ఉన్న నిందితులకు శిక్ష పడటంలో ముఖ్య పాత్ర వహించిన సందర్భంగా శనివారం సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో సీపీ అవినాష్ మొహంతి యాదయ్య కు అవార్డు అందజేసి అభినందించినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.
- Advertisement -



