Friday, March 20, 2026
E-PAPER
Homeబీజినెస్కోవాసెంట్‌కు అంతర్జాతీయ ఎఐ గుర్తింపు

కోవాసెంట్‌కు అంతర్జాతీయ ఎఐ గుర్తింపు

- Advertisement -

హైదరాబాద్‌ : ఏజెంటిక్‌ ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఒ/ఐఇసి 42001:2023 సర్టిఫికేషన్‌ను పొందినట్లు తెలిపింది. ప్రపంచంలోనే తొలి అంతర్జాతీయ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రమాణంగా గుర్తించబడిన ఈ సర్టిఫికేషన్‌ పొందిన కొద్ది సంస్థల్లో ఒకటిగా కోవాసెంట్‌ నిలిచిందని పేర్కొంది. తద్వారా మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఏడబ్ల్యూఎస్‌ వంటి గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాల సరసన తమ సంస్థ చేరిందని కోవాసెంట్‌ సీఎండీ సివి సుబ్రమణ్యం తెలిపారు. ఏజెంటిక్‌ ఏఐని ప్రయోగ దశ నుండి పూర్తి స్థాయి ఉత్పత్తి దశకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని ఆ సంస్థ సీఈఓ శ్రీకాంత్‌ చక్కిలం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -