దుఃఖం..
కుండ పొత వానై కురుస్తుంది
అలలు అలలుగా కెరటాలై
ఎగిసి పడుతుంది
హదయం చిమ్మ చీకట్లో
చుక్కలు లేని శూన్యంలో..
దేనికోసమో వెతుకుతున్నది.!
ఎలుకలు కొరికిన చిరుగు చొక్కాలా
పగిలిన కుమ్మరి కుండల.. ఆత్మ లేని దేహంల.. నిర్జీవంగా..
నిసత్తువుగా.. ఒంటరి అనాధల
ఊరికి దూరంగా.. పడేసినట్టు
కూలి పోయి దిక్కులేని పక్షిలా
పురాతన కూన పెంకుల మట్టి గోడల ఇల్లొక్కటి..
ఇంకా చెక్కిన శిల్పంలా.. గోడకి
వేలాడదీసిన ఓ అట్ట బొమ్మ..
ఆశ్చర్యం.!
వెన్నెల వెలుగులో పూసిన పున్నమి
నవ్వుల
”అమ్మ ” చిత్రం..
చిన్నప్పుడు బడి పోటీలో గీసి బహుమతి
పొందిన అమ్మ ఫొటో
ఇంకా సజీవంగా.. కళ్ళెదుటే
ఉన్నట్టు..
రా రమ్మని నయనాలతో సైగ చేస్తున్నట్టు..
ఎంత రమణీయ కమ్మని దశ్యం
ఆమె పిలుపు అదొక ఆనందల రాగం
ఆమె తినిపించిన గోరుముద్దలు
అమత పాల కడియలు
దగ్గరికి తీసుకుని ముద్దులాడి..
రామాయణం, భారత, భాగవతం కథలు చెప్పి లోకజ్ఞానం నేర్పిన క్షణాలు..
చదువు రాని ఆ తల్లీ..
ఎన్నెన్నో నీతులు, జీవిత పాఠాలు, ప్రకతి వింతలు నేర్పి
ఎలా బతకాలో ఈ సమాజంలో..
మానవ జన్మ ఎత్తినందుకు
తిరిగి ఏమి ఇవ్వాలో ఆనాడే తెలియ చేసిన గొప్ప తత్వవేత్త అమ్మ.!
అమ్మ అచేతనంగా పడి ఈ లోకం విడిచి పోయినప్పుడు
గుండెల్లో పిడుగు పడ్డట్టు..
కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు..
కోలుకోవడానికి కొన్ని నెలలే పట్టాయి..
అమ్మ చెప్పిన ఆశయసాధన కోసం
ఊరు విడిచి కొన్ని సంవత్సరాలు అయ్యే..
ఇప్పుడు నేనొక అమ్మ ఊహల్లో రత్నంలా రాటుదేలిన
సగటు భారతీయ పౌరుడుని..
అందమైన కలల రాకుమారుడుని
ఇప్పుడు అన్నీ ఉన్నారు..
లేనిదల్లా..
కన్న తల్లీ కన్న ఊరు.. పుట్టిన ఇల్లు
చదువు కోసం పరితపించిన మమకారం వెదజల్లిన మాతమూర్తి..
ఎందరినో అక్కున చేర్చుకుంది..
మరెందరికో చదువు విలువ చెప్పింది..
ఇప్పుడు అమ్మ చిరకాల స్వప్నం నిజం చెయ్యాలి
పాడుబడిన ఇంటికి బదులు బడిని నిర్మించి ఊరు ఋణం తీర్చుకోవాలి..
అమ్మ రూపం! ఈ బడిలో ప్రతి పలకలో అక్షర అక్షరమై
ప్రతిధ్వనించాలి..!!
కొండా రవీందర్ , 9059237771
అట్ట బొమ్మ..
- Advertisement -
- Advertisement -



