Tuesday, May 20, 2025
Homeట్రెండింగ్ న్యూస్కరోనా మళ్లొచ్చింది..పెరుగుతున్న కేసులు

కరోనా మళ్లొచ్చింది..పెరుగుతున్న కేసులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు భారతదేశానికి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న కేసుల సంఖ్య.. క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మన దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మే నెలలో ఎక్కువగా నమోదు కావటం విశేషం.
కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం 95 కోవిడ్ కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ వ్యక్తి చనిపోయినట్లు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 27 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇక మహాష్ట్రాలో మొత్తం 44 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 34 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు అధికారికంగా ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
ఇక మన దేశ వ్యాప్తంగా తీసుకుంటు.. మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వీరిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని.. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోనుకుని ఇంటికి వెళుతున్నారని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. 
సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయని.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని.. వైరస్ వ్యాప్తి, లక్షణాలు ఇతర సమాచారాన్ని ఎప్పటికిప్పుడు పరిశీలిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజట్, ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్, ఐసీఎంఏఆర్ ప్రకటించాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ లక్షణాలు బలహీనంగానే ఉన్నాయని.. అక్కడ ఆస్పత్రుల్లో చేరిన రోగులు.. 7 రోజుల్లోనే కోలుకుని ఇంటికి వెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వైరస్ వల్ల జలుబు, జ్వరం, తలనొప్పులు వంటివి వస్తున్నాయని.. ఇవి అంత ప్రమాదకరం కాదని స్పష్టం చేసింది కేంద్రం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -