Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి

కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి

- Advertisement -

నవతెలంగాణ-రామన్నపేట : కరెంట్ షాక్ తో ఆవు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బీసీ కాలనీలో నివాసం ఉండే రైతు మోటే రాజుకు కాలనీకి సమీపంలోనే సొంత వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం, పశుపోషణ చేస్తూ రాజు జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం మేతకు వదలగా సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మేత మేస్తుండగా హెర్త్ వైర్ తగిలి కరెంటు షాక్ కు గురి కావడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. 40 వేల రూపాయల విలువైన ఆవు మృతి చెందడంతో రైతు రాజు కన్నీటి పర్వతమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -