నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని చీమలబావి తండా శివారు కుంతావత్ తండాకు చెందిన ధారావత్ రెడ్డి ఆవు ఆదివారం విద్యుత్ అగాధంతో మృతి చెందింది. బాధిత రైతు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తండా సమీపంలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అతి సమీపంలో ఉందని అన్నారు. ట్రాన్స్ ఫార్మర్ నేలబారున ఉండడంతో ప్రమాదాలు జరుగుచున్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు.
తన వ్యవసాయ భూమిలో మేతకు వెళ్లిన ఆవు ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిందని బోరున విలపించారు. ఆవు మృతి చెందడంతో వ్యవసాయం అగమ్య గోచరంగా మారిందని, ఆవు విద్యుదగాదంతో మృతి చెందడంతో సుమారు రూ.60వేల నష్టపోయానని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించి బాధిత రైతును ఆదుకోవాలని కుంతావత్ తండాకు చెందిన కుంతావత్ కమలాకర్ డిమాండ్ చేశారు.



