నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ పోలీస్ శాఖ వారి అధ్వర్యంలో గురువారం జరిగిన మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం పెర్కిట్ మీనాక్షి కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య చేతుల మీదుగా పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ తను చేస్తున్న సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియాత్రణ, హెల్మెట్ ఉచితంగా వితరణ ఇతర సామాజిక సేవలకు పట్వారీ తులసి కి పోలీస్ శాఖ తరుపున ఉత్తమ సంఘ సేవకులుగా గుర్తించి సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పట్వారి తులసి నేటి తరానికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డిఎస్పీ బస్వారెడ్డి ఏసిపి వెంకటేశ్వర రెడ్డి , స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవకుడిని సన్మానించిన సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



