నవతెలంగాణ – ఆర్మూర్
మూడవ విడత ఎన్నికలలో భాగంగా నందిపేట్, బాల్కొండ, మోర్తాడ్, ఆర్మూర్ ( గోవింద్ పేట్ ) మండలం కేంద్రంలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , సిబ్బంది అధికారులు అప్రాతంగా ఉండాలని సూచించడం జరిగింది.
ప్రజలు శాంతి యూత వాతావరణం లో తమ ఓటు హక్కు ను సధ్వినియోగం పర్చుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా అదనపు డి. సి. పి (ఎ. ఆర్) శ్రీ రామచంద్రరావు, ఏసిపి శ్రీ జె. వెంకటేశ్వర్ రెడ్డి , సీఐ శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ విజయ్ బాబు , ఎస్. ఐ లు శ్రీ రాము , శ్రీ వెంకట్రావు , శ్రీ వినయ్ శ్రీ శైలేందర్ , శ్రీ ఐ. కె. రెడ్డి ఆర్వో అధికారులు చంద్రమోహన్ , పండరి , సంతోష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



