నవతెలంగాణ – కంఠేశ్వర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిఖిరం కార్యాక్రమం ఉదయం నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమ వంతు సహయముగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడినవారు అవుతారని తెలియజేశారు.
ఈ రక్తదానం చేయడం ద్వారా మనం ఎందరికో కొత్తజీవం అందించిన వారు అవుతారు అని అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించాడం జరిగింది.అనంతరం రక్త దానo చేసిన వారికి పోలీస్ కమిషనర్ గారు హెల్మెట్ లు ప్రదానం చేయడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ్ చందర్ రావ్ నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి. మస్తాన్ అలి, పోలీస్ యునిట్ ఆఫీసర్ డా॥ సరళ, రిజర్వు ఇన్స్పెక్టర్ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సి.ఐలు, ఎస్.ఐలు, మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది, పోలీస్ యునిట్ హాస్పటల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది రక్తదానం చేసిన ప్రజలు తదితరులు హాజరయ్యారు.
రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



