ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జెపి నడ్డా, నితిన్ గడ్కరీ, పీయూశ్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఎన్డీఏ కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్కర్, వెంకయ్య నాయుడు, హమీద్ అన్సారీ కూడా హాజరయ్యారు. రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
- Advertisement -
- Advertisement -