Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

- Advertisement -

ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నాడిక్కడ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హౌం మంత్రి అమిత్‌ షా తదితర పార్టీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేశారు. సమావేశ అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సీపీ రాధాకృష్ణన్‌ పేరును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. జగదీప్‌ ధన్కర్‌ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్‌ 9న జరగాల్సి ఉండగా, ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. గతంలో రెండు సార్లు (1998, 1999) కోయంబత్తూరు ఎంపీగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయన 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌ (అదనపు బాధ్యతలు)గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ కు అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా 2024 జులై 31 వరకు అదనపు బాధ్యతలు, పుదుచ్చేరి గవర్నర్‌గా 2024 ఆగస్టు 6 వరకు పని చేశారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad